Goooglenews

అసమర్ధ నాయకులే తెదేపాకు యమపాశాలు

అసమర్ధ నాయకులే తెదేపాకు యమపాశాలు

అసమర్ధ నాయకులే తెదేపాకు యమపాశాలు
November 06
11:40 2019
తాత పుణ్యమా అని బావి త్రవ్విస్తే, మనుమడి పుణ్యమా అని పూడ్చేశాడు అని ఓ ముతక సామెత.  ఇది తెలుగుదేశం పార్టీకి బాగా వర్తిస్తుంది. తెలగు రాఫ్ట్రం లో తిరుగులేని ప్రభంజనం సృఫ్టించిన తెలుగుదేశం 2019 ఎన్నికలలో ప్రజల ఆగ్రహాన్ని చవిచూసింది. దారుణమైన అపజయాన్ని మూటకట్టుకుంది.
 పార్టీ ఘోర వైఫల్యానికి కారణం కేవలం కోవర్టులను గుర్తించడంలో పార్టీ దృష్టిసారించక పోవడం.  పార్టీలో గుత్తాధిపత్యం తీసుకున్న ఓ సామాజికవర్గం చంద్రబాబు నాయుడు కళ్లకు గంతలు కట్టి శల్యసారధ్యం వహించారు. కేవలం ప్రజా సంక్షేమం అంటూ చంద్రబాబు రాత్రింబవుళ్లు దస్త్రాలతో కుస్తీ పడుతుంటే తెలుగు తమ్ముళ్లు బాబుకు జ్ఞానేంద్రియాలుగా మారిపోయారు. 
  ప్రభుత్వానికి  సమాంతరంగా పార్టీలో కీలకంగా వున్న నాయకులు స్వహంకార పోషకులుగా మారిపోయారు. సమిష్టి కాస్తా ఏకపుష్టిగా మారిపోయింది. అంకిత భావంతో పని చేసే వారికి బాసట కరువయింది. పెదవి దాటకూడని రహస్యాలెన్నో ప్రపంచాన్ని తాకాయి. పార్టీకి అనుకూల శత్రువులుగా పని చేస్తున్న నాయకుల జాబితా చేతికి అందించినా అధినాయకత్వం చేష్టలుడిగి చూడటం మినహా చర్యలకు ఉపక్రమించలేదు. చంద్రబాబు చుట్టూ ప్రాకారంలా భాజాభజంత్రీలు చేరాయి. బయటి గోల బాబుకు అర్ధం కాకుండా గట్టిగా తమ వాయిద్యాన్ని వినిపించాయి. అటు ప్రజలకే కాకుండా ఏకంగా
పార్టీ అధ్యక్షుడికే పంగనామాలు పెట్టారు తెలుగు తమ్ముళ్లు. నిర్లక్ష్యాన్ని నరనరాన జీర్ణించుకున్న ఓ వర్గం,  ఏమాత్రం సహనం లేని సీనియర్లు వాస్తవాలను ఆకళింపు చేసుకోవడంలో ఘోరంగా విఫలం అయ్యారు. వాస్తవాలను వెల్లడించే వేగులను పాతాళానికి తొక్కివేశారు.  వాస్తవాలను వెల్లడించే ఔత్సాహికులను ఓరకంటితో నియంత్రించి, నిజాలను పొట్టుతో కప్పి పెట్టారు. పార్టీ అధ్యక్షుడుగా చంద్రబాబు  స్వయంగా ఆదేశించినా అమలు కాని పరిస్థితికి పార్టీ చేరుకున్నాఏమాత్రం స్పష్టత తేదు.  సహజత్వానికి దూరంగా వుండే గుంటనక్కల బారిన పడిన ఏ రాజకీయ పార్టీ అయినా ప్రజల అగ్రహానికి గురి కావలసిందే అని  మరోమారు రుజువయింది.
యువరాజు గారి సంగతి సరేసరి
ప్రతి విషయంలోనూ యువరాజు గారు పూర్తి నియంత్రణ చేపట్టారని చెబుతున్నారు. ముఖ్యంగా ఆర్థిక వ్యఃవహారాలలో చంద్రబాబు సతీమణి జోక్యం కొంత పార్టీకి నష్టం కలిగించిందని నాయకులు చెబుతున్నారు. చినబాబు కు సహాయంగా ఉన్న ఓ అపరిమిత అజ్ఞాని సగం సమాచారాన్ని మాత్రమే చేరవేసేవాడు. అదికూడా ఆలస్యంగా అని తీవ్ర విమర్శలు వున్నాయి.  ఆ విషయాన్ని చినబాబుకు నాయకులు వెల్లడించినా ఆయన చెవిలో వేసుకోలేదు. ఈ కారంణంగా పార్టీకి జరిగే నష్టాన్ని నిలువరించలేక పోయినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఎన్నికల సమయం లోనూ సమన్వయ లోపం.
ఎన్నికలు తేదీ సమీపిస్తున్నప్పటికీ ఏమాత్రం సమన్వయం లేకుండానే పార్టీ అభాసుపాలు అయింది. చంద్రబాబు కోటరీలో పని చేసే ఓ అసమర్ధుడికి సమన్వయ బాధ్యతలు అప్పగించారు. అది నాయకత్వం చేసిన క్షమించరాని నేరంగా పార్టీలో గుసగులు వినిపించాయి.
కొందరు బాబు వద్దకు పూర్తి సమాచారం వెళ్లకుండా  నాయకుల ముందు చూపుకు దూరంగా పెట్టారు.  పైపై మెరుగులు దిద్ది పార్టీ అధికారానికి దూరమవటానికి దోహదపడ్డారు.  ఎన్నికల బరిలోదిగిన శాసనసభ, లోక్సభ అభ్యర్థులు తమ గోడు ఎవరికి చెప్పుకోవాలో తెలీని దుస్థితి. పార్టీ కి రాష్ట్ర అధ్యక్షుడుగా పని చేస్తున్న ఓ పెద్దాయన, ఏ సమాచారాన్ని అయినా చించేస్తాడనే పేరున్న ఓ రావు గారు పార్టీ అధికారంలోకి రాకుండా గట్టి గానే సలహా ఇచ్చారు. పనికిమాలిన లాజిక్ లతో మరో ముతక నాఃయకుడు, విశ్లేషణ లో దిట్టగా పెరొందిన  కొందరు ఉత్త కుమారులు చంద్రబాబు పుట్టి మునగడానికి కారణం అని చెప్పాలి. కేవలం ఎదుటివారి పై దాడి చేసే ప్రవృర్తి కలిగిన కోటరీతో చంద్రబాబు పార్టీ అధికారానికి దూరమయింది. ఇటీవల ఎంపీ స్థానానికి పోటీ చేసిన అభ్యర్థి మా రాజకీయ భవితవ్యం ఏంటని ఆ కోటరీని ప్రశ్నించినపుడు మొహం చాటేసినట్లు చెబుతున్నారు.  ఇప్పటికి అయినా తెలుగుదేశం పార్టీ నాయకత్వం బేషిజాలు మానుకుని కార్యకర్తల మనోభావాలను గౌరవించాలని కోరుతున్నారు.

About Author

goooglenews

goooglenews

Related Articles

0 Comments

No Comments Yet!

There are no comments at the moment, do you want to add one?

Write a comment

Write a Comment