Goooglenews

అవినీతే ఆహారం…నిర్లక్ష్యమే సమాధానం

అవినీతే ఆహారం…నిర్లక్ష్యమే సమాధానం

అవినీతే ఆహారం…నిర్లక్ష్యమే సమాధానం
November 13
11:46 2019
ఆ ప్రభుత్వ శాఖ పేరు చెబితేనే ప్రజల నోటి నుంచి వచ్చే పదం ఛీ ఛీ. ఏమాత్రం నిలకడ, నిజాయితీ, అంకితభావం, పాపభీతి ఇసుమంత అయినా లేని ఆ శాఖ పేరు రెవెన్యూ. ఆ శాఖ కార్యాలయానికి ఎవరు వచ్చినా ఏదో ఒకటి చెల్లించుకోవాల్సిందే. రాజ్యాంగంలో రాయని చట్టం అది. ఆ శాఖ ఉద్యోగి ధనదాహం తీర్చక పోతే  ఏదో ఒక  మెలిక పెట్టి ప్రజలను ముప్పు తిప్పలు పెట్టడంలో వారికి వారే సాటి. కరుకు తనం, జాలి వయసు తో సంబంధం లేకుండా రక్తాన్ని తాగే జలగలు ఆ ఉద్యోగులు. నిర్లక్ష్యాన్ని నరనరాన జీర్ణించుకుని ఓ మనిషీ రేపు రా అంటూ నిర్ధయగా చెప్పే ఆ శాఖ బారిన పడి విసుగు చెందని పౌరులుండరంటే అతిశయోక్తి కాదు. అటువంటి ఆ శాఖ అధికారిపై తెలంగాణ రాష్ట్రంలో ఓ వ్యక్తి పెట్రోలు పోసి నిప్పు అంటించాడు.

 
ఓ అధికారిపై దాడి చేసి చంపేశారని రక్షణ కరువయిందని వగర్చే ఆ శాఖ సిబ్బంది చేసే అకృత్యాలకు ప్రజలు ఏ శిక్ష విధించినా అది తక్కువే అవుతుంది. ప్రాణం పోయినా పర్లేదు ఉద్యోగులుకు బుద్ధి చెప్పాలనుకున్నాడో ఏమో సురేశ్ అనే వ్యక్తి ఏకంగా అధికారిపై పెట్రోలు పోసి నప్పు అంటించితాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అంటే ఆ శాఖ ఉద్యోగుపై ఎంతటి అసంతృప్తి జ్వాలలు ఎగిసి పడుతున్నాయో యోచించడండి. తహసీల్ధార్, రెవెన్యూ ఇన్ స్పెక్టర్ లాంటి అధికారులతో విసుగు చెందని పౌరులుండరంటే నమ్మండి.    పురిటి బిడ్డ నుంచి కాటికి కాళ్లు చాచిన వృద్ధుల వరకు రెవెన్యూ శాఖ బాధితులు పడిన కష్టాలు ఏకరువు పెడితే లెక్క చెప్పలేనన్ని సినిమా కథలు అవుతాయి. 
తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా కుత్బుల్లాపూర్ మెట్ ఎమ్మార్వో విజయరెడ్డి పై సురేశ్ అనే వ్యక్తి పెట్రోలు పోసి నిప్పంటించిన సంఘటన తెలుగు రాష్ట్రాలలోని ఉద్యోగులను విస్మయానికి గురి చేసింది.
ఈ దుశ్చర్యను యావత్తు సమాజం తీవ్రంగా ఖండిస్తున్నది. అది మానవతాదృక్పదం. సురేశ్ పెట్రోలు పోసి నిప్పు అంటించిన ఘటనలో  ఎమ్మార్వో తో పాటుగా డ్రైవర్ మృతి చెందారు. నిందితుడు సురేశ్ కూడా తీవ్రగాయలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఉదంతం వెనుక కథ ఏమిటి. ఈ దాడిని ఖండించాలా లేక జాలిపడాలో అర్థం కాని పరిస్థితిలో ప్రజలు  సందిగ్ధంలో పడిపోయారనే చెప్పాలి.
ఉద్యోగుల దుర్మరణం తో  రెవెన్యూ శాఖలోని ఉద్యోగులు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. మానశికంగా బలహీనపరిచేలా ఈ దాడులు ఉన్నాయంటూ తమ ఆవేదనను వ్యక్తం చేశారు. తమ శాఖలోని ఉద్యోగులపై దాడిని నిరశిస్తూ విధులను బహిష్కరించారు. తమకు రక్షణ కల్పించాలని  ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. అసలు దాడులు ఎందుకు జరుగుతున్నాయి….?
రెవెన్యైూ శాఖ అధికారులపై దాడులకు స్వయంకృపారాధం అని ప్రజలు అభిప్రాయం పడుతున్నారు. ఆ శాఖలో పని చేసే కొందరు ఉద్యోగులు మినహా ఇంచుమించు అందరూ నిరంకుశంగా వ్యవహరిస్తారని తెలుస్తున్నది. మహిళ అధికారిపై దాడిని ఖండిస్తూ కొన్ని ప్రజా సంఘాలు తవ్రంగా ప్రతిఘంటించాయి, కాని మిగతా వాళ్లలో ఏమాత్రం సానుభూని కనిసించడం లేదు. దాడి జరిగిన తీరును ఖండిస్తూనే సురేశ్ ను సమర్థించిన వాళ్లు లేకపోలేదు. అధికారి పై దాడి చేసిన సురేశ్ పలుమార్లు ఎమ్మార్వో కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేసినా సంబంధిత అధికారులు స్పందించలేదనే వాదనలు తెరపైకి వస్తున్నాయి. అవినీతి కంపు కొడుతున్న రెవెన్యూ శాఖను పాపం అన్న దిక్కు లేదనే చెప్పొచ్చు. అసలు ఆ శాఖలో లంచం లేనిదే పని చేయకూడదని కొందరు కాశీకి వెళ్లి ఒట్టు వేసుకుని వచ్చారట. ఇది ఈ సందర్భంగా సోషియల్ మీడియాలో వెలువడుతున్న వెటకారం. ఓ మహిళా అధికారి దాడికి గురయిందన్న ఆవేదనను వెళ్లగక్కుతున్నప్పటికీ రెవెన్యూ శాఖపైవున్న ఆగ్రహం కట్టలు తెంచుకుంటున్నది. రెవెన్యూ శాఖ పై వున్న అక్కసు మెత్తం సురేశ్ రూపంలో మృత్యువుగా దాపురించిందని అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి.  లొసుగులు చూపి పని ఎగ్గోట్టడంలో రెవెన్యూ శాఖ నిపుణతను ప్రతి ఒక్కరూ అంగీకరించాల్పిందే. పుట్టుక నుంచి గిట్టినంత వరకు రెవెన్యూ శాఖలో ప్రతి మనిషి ప్రదక్షిణలు చేయాల్పిందే. లేదా లంచం ఇచ్చుకోవాల్పిందే. ఉత్తరం వున్నా దక్షిణం విషయం లో కచ్ఛతత్వం పాటించడం ఈ శాఖ కు ఆనవాయితీ. చివరకు దివ్యాంగుల వద్ద కూడా లంచం తీసుకునే సంస్కారం వీళ్లకు ఎక్కడి నుంచి వచ్చిందని ఓ దివ్యాంగుడు పేర్కొన్నారు. తాను దివ్యాంగుడనని, ఉపాది కోల్పోయానని, రేషన్ బియ్యం మినహా మరో దారి లేదని కాళ్ల వేళ్ల పడినప్పటికీ ఆ ఉద్యోగులు కనుకరించలేదు. ఆపై అధికారి…తర్వాత ఆపైన, ఇంకా పై అధికారి చుట్టుతా తిరిగిప్పటికీ ఏ ఫలితం లేదు. చివరకు లంచం ఇచ్చి రేషన్ కార్డు సంపాదించాడు. ఇది సినిమా కథ కాదు. నిప్పు లాంటి నిజం. గంజాయి వనంలో తులసి మొక్కలా ఒకరో ఇద్దరో కూడా వుంటారు. కాని పాపం వాళ్ల బాధ వర్ణనాతీతం. అందునా ఓ సామాజిక వర్గం అయితే నువ్వేం చేసుకోలేవు. మాది చాలా పెద్ద యూనియన్. నువ్వు ఎక్కడికి వెళ్లినా సాధించేది ఏమీ లేదు. నువ్వు బ్రతికి బట్ట కట్టావని ఈ ప్రపంచానికి తెలియాలంటే నా సంతకమే ఆధారం అంటూ బెదిరింపులకు దిగుతారు. నగరాల్లో కొంత ఇది మారినప్పటికీ, పట్టణ వాసులకు ఈ పాట్లు అలవాటే. ప్రస్తుతం విశ్రాంతి తీనసుకుంటున్న ఓ కాజకీయ నాయకుడు సంచలనాలకు మారుపేరు. నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి మంత్రివర్గంలో రెవెన్యూ శాఖ మంత్రిగా పని చేస్తున్న నేపథ్యంలో, రెవెన్యూ శాఖ అధికారులు రవీంద్రభారతిలో ఓ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా ఆహ్వానించారు. ఆ మంత్రిగారు తన ప్రసంగంలో అధికారులను ఉద్యేశించి మాట్లాడుతూ….ఈ శాఖ మంత్రిగా వుండడం నా దురదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. ఆ ప్రకటనకు అధికారులందరూ విస్తుపోయారు. మీరు చేసే అవకతవకల వల్ల ప్రజలలో తలెత్తుకోలేక పోతున్నానని, సిగ్గుగా వుందని కూడా వాఖ్యానించారు.  ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు ఆ శాఖ అధికారులతో జరిపిన సమీక్షలో ప్రజలను మీ శాఖ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోందని తీవ్ర అభ్యంతరం తెలిపారు. అనవసరమైన దస్త్రాలు కావాలంటూ ప్రజలను ముప్పుతిప్పలు పెడుతున్నారంటూ పెదవి విరిచారు. భూముల విషయంలో మీరు చేస్తున్న మతలబుల వల్ల ప్రభుత్వం పై ప్రజలకు అసంతృప్తి వుందని స్పష్టం చేశారు. ఇంతకన్నా ఏం ఆధారాలు కావాలి రెవెన్యూ శాఖ గురించి చెప్పడానికి. తెలంగాణ అవినీతి నిరోధక శాఖ అధికారులు రెవెన్యూ శాఖ ఉద్యోగులపై గత ఏదాడి  204  కేసులు నమోదు చేశారు.  కర్నూలుజిల్లా గూడూరు ఎమ్మార్వో గారు తన బినామీ ద్వారా 4 లక్షలు వసూలు చేసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. తెలంగాణలో లావణ్య అనే ఓ తహసీల్ధార్ ఏసిబికి చిక్కారు. ఇదీ రెవెన్యూ అధికారుల చాటుమాటు దణదాహ పరిస్థితి.
రాత్రింబవుళ్లూ పని చేసే అధికారులూ వున్నారు….
తుఫానుల్లో, ప్రకృతి వైపరిత్యాలలో ప్రాణాలకు తెగించి  ఎనలేని సేవలు రెవెన్యూ అందిస్తుంది. విశాఖపట్టణంలో హుద్హుద్ తుఫాను తర్వాత నగరాన్ని అంతే సుందరంగా తీర్చి దిద్దేందుకు రెవెన్యూ శాఖ చేసిన కృషిని విశాఖ ప్రజలు మరిచిపోలేరు.
నాణేనికి ఇది మరో వైపు. కొందరు ఉద్యోగులు, అధికారులు మిగతా ప్రభుత్వ, స్వచ్ఛంద సంస్థలతో కలిసి సహాకారంతో పనిచేయడంలో దిట్ట అని చెప్పవచ్చు. ప్రకృతి వైపరీత్యాలలో కూడా చేతివాటం ప్రదర్వించిన దాఖలాలు కూడా వున్నాయి.

About Author

goooglenews

goooglenews

Related Articles

0 Comments

No Comments Yet!

There are no comments at the moment, do you want to add one?

Write a comment

Write a Comment