రాయదుర్గం భూముల వేలం వ్యవహారంలో సుప్రీం కోర్టు జోక్యం చేసుకోబోదని సర్వోన్నత న్యాయస్థానం ఈ మేరకు స్పష్టం చేసింది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం పై విధంగా వ్యాఖ్యానించింది. ఈ భూ తగాదాను స్థానిక హైకోర్టులోనే తేల్చుకోవాలని సూచించింది. రామదుర్గం సాన్మక్తాకు సమీపంలోని రెండు సర్వే నెంబర్ల లోని 11 ఎకరాలను విక్రయించేందుకు టీజీఐఐసీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఒక్కోఎకరాకు కనీష్టం రూ. ఒక్క వంద 75 కోట్లుగా ధరను ప్రకటించింది. ఈ నేపథ్యంలో జువ్వాడి ప్రణయ సింహారావు సుప్రీంకోర్టును ఆశ్రాయించారు. గతంలో కంచ గచ్చిబౌలి భూముల వేలం, ప్రక్రియపై సుప్రీం స్టే విధించిందని పిటిషనర్ తరపు న్యాయవాది న్యాయస్థానానికి విన్నవించుకున్నారు. అయితే పిటిషనర్ న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని ప్రభుత్వం తరపున న్యాయవాది ధర్మాసనానకి వివరించారు. గతంలో న్యాయస్థానం స్టే విధించిన కంచ గచ్చిబౌలి భూమి ప్రస్తుత వేలం నోటిఫికేషన్ జారీ చేసిన ప్రదేశానికి సుమారు 5 కిలోమీటర్ల దూరంలో వుందని, గతంలో సుప్రీం ఆదేశాలు ప్రస్తుత రెండు సర్వేలకు వర్తించవని తమ వాదనలు వినిపించారు. అయితే ప్రభుత్వ తరపు న్యాయవాది వాదనలను పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం స్థానిక హైకోర్టులో ఈ సమస్యను పరిష్కరించుకోవాలని తేల్చి చెప్పింది.
