September 3, 2026 11:21 am

ఉత్తరాంధ్రకు గోదావరి జలహారతి.

ఉత్తరాంధ్ర ప్రాంతంలో 287 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించే బృహత్తర కార్యక్రమానికి సియం నారా చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టారు. బుధవారం సాయంత్రం అనకాపల్లి జిల్లా పాయకరావుపేట వద్ద  పోలవరం ఎడమ కాలువ నుంచి రెగ్యులేటర్ ద్వారా ఉత్తరాంధ్రకు గోదావరి జలాలను జలహారతి సమర్పించి, దిగవకు నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా అక్కడ పండుగ వాతావరణం నెలకొంది. తలపాగా ధరించి రైతు వేషధారణలో ముఖ్యమంత్రి నీటిని విడుదల చేశారు. తొలుత వేదపండితుల ఆశీర్వచనం అనంతరం సియం నీటి విడుదల కావించారు. సముద్రంలోకి వృధాగా కలసిపోయే గోదావరి జలాలను ప్రతి నీటి బిందువును ఒడిసిపట్టి రైతులకు అందించే ఈ కార్యక్రమం తో రాష్ట్రం సుభిక్షంగా వుండాలని ఈ సందర్బంగా సింయ ఆకాంక్షించారు.  నీటి విడుదల అనంతరం చంద్రబాబు గోదావరి జలాలకు ఒడ్డు పైనుంచి సాష్టాంగ నమస్కారం, పుష్ప నివేదన చేశారు. నీటి విడుదల సమయంలో అక్కడి ప్రజలు కేరింతలు కొడుతూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. భవిష్యత్ తరాలకు ఉత్తరాంధ్రలో నీటి కొరత వుండబోదని ధీమా వ్యక్తం చేయడం కనిపించింది. ఉత్తరాంధ్రలోని 4 జిల్లాల 9 లక్షల మంది ప్రజలకు దాహార్తి తీర్చేందుకు ఈ జలాలు వినియోగించుకోవచ్చని సియం వెల్లడించారు. ఎడమకాల్వ నిర్మాణానికి 4 వేల 192 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసింది. గోదావరి జలాల ద్వారా అనకాపల్లి వద్ద ఏలేరు కాలువతోపాటు ఆ జిల్లాలోని 110 చెరువులకు నీళ్లు నింపేందుకు జలవనరుల శాఖ ప్రణాళికలు రచించింది. పోలవరం ఎడమ కాలువ నుంచి జాలువారే గోదావరి జలాల వినియోగంతో పుఫ్కర ఆయకట్టు పరిధిలో 1.48 లక్షల ఎకరాలు, ఏలేరు కింద 80 వేల ఎకరాలు, పంపా కింద 12 వేల ఎకరాలు, తాండవ,మామిడి రెడ్డ ఆయకట్టు పరిధిలోని 46 వేల 620 ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలుస్తున్నది. విశాఖ, అనకాపల్లి పారిశ్రామిక వాడలకు 23.44 టీఎంసీల నీరు అందించి ప్రోత్సాహం అందిస్తారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top