అభోబిలం. ప్రతినిధి
నంద్యాల జిల్లా అహోబిలం అడవులలో నృసింహస్వామి భక్తులు దారి తప్పిపోయారు. ఆళ్లగడ్డ పోలీసుల కథనం ప్రకారం, కడప జిల్లా ప్రొద్దుటూరు కు చెందిన భక్త భక్త బృందం బుధవారం సాయంత్రం అహోబిలం లోని నృసింహస్త్వామి ఆలయం దర్శించుకున్నారు. ఆ తర్వాత అడవి ప్రాంతంలోని పావన నృసింహస్వామి ఆలయానికి వెళ్లారు. స్వామి దర్శనం అనంతరం తిరుగుప్రయాణంలో అడవి మార్గంలో భక్తులు దారి తప్పిపోయారు. ఈ సంగతి తెలుసుకున్న పోలీసులు, అటవీశాఖ సిబ్బంది రాత్రంతా గాలంపు చర్యలు చేపట్టారు. పలు బృందాలు గా విడిపోయిన సిబ్బందితోపాటు కొందరు స్థానికిులు కూడా పోలీసులకు సహాయంగా వెళ్లారు. చివరకు గురువారం తెల్లవారు జామున భక్తులను దిగువ అహోబిలం కు సురక్షితంగా తీసుకువచ్చారు. పొద్దు పోయిన తర్వాత అడవిలోని ఆలయాల దర్శనం సురక్షితం కాదని పోలీసులు హితవు పలికారు. కాగా భక్తులకు పోలీసులు సేద తీరేందుకు విశ్రాంతి గృహంలో వసతి కల్పించి అన్నపానీయాలు అందించారు. వైద్య సహాయం కూడా సిద్దం చేశారు.
