తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. విభిన్న రూపాల ప్రకృతి సిద్ధంగా తయారు చేసిన వినాయక విగ్రహాలు వాడవాడలలో వెలిసాయి. బాలుర నుంచి వృద్ధుల వరకు గణపతిని భక్తి శ్రద్ధలతో పూజిస్తున్నారు. వినాయక చవితి సందడి తెలుగు రాష్ట్రాలలో రెండు రోజుల ముందు నుంచే ప్రారంభం అయింది. వినాయక మండప సంఘాలు ఒకరితో మరొకరు పోటీ పడి మరీ విగ్రహాలను ఆకాశపు అంచులదాకా చేరే విధంగా ప్రతిష్ఠించారు. పువ్వులు, కూరగాయలు, వివిధ రకాల పళ్లు, బంగారు ఆభరణాలతో సహా రజిత వర్ణాలతో వినాయకుడిని అలంకరించారు. హైదరాబాదు లో బాలాపూర్, ఖైరతాబాదులో ఎంతో ప్రతిష్ఠాకరంగా గణేశుని విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. వినాయకుని సందర్శకులకు ఆయా కమిటీల సభ్యులు సౌకర్యాలు కల్పించారు. ముఖ్యంగా దివ్యాంగుల కోసం ప్రత్యేక మార్గాలను, బ్యాటరీ వాహనాలను సమకూర్చారు. గణేశ్ మహారాజ్ కీ జై అంటూ….భక్తితో నినాదాలు చేయడం కనిసిస్తున్నది. గణేశ మండపానికి అన్ని వైపుల విద్యుత్ దీపాలంకరణతో వెలిగిపోతున్నాయి. పగలు రాత్రి అనే తేడా లేకుండా గజముఖుని దర్శనానికి భక్తులు బారులు తీరుతున్నారు. దర్శనానికి వచ్చిన భక్తులకు తీర్థ, ప్రసాద వితరణ జరుగుతోంది. గణేశ మండపాలు నిత్యం బొజ్జ వినాయకుని భక్తి గీతాలతో దద్దరిల్లుతోంది. పోలీసులు మండపాల సమీపంలో గట్టి నిఘా వ్యవస్థను, పికెట్ ను ఏర్పాటు చేశారు. ఇది ఇలా వుండగా సున్నిత ప్రాంతాలలో మతసామరస్యం ప్రధాన భూమిక పోషిస్తున్నది. గణేశ మండపాల వద్ద అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా అన్ని మతాల పెద్దలతో ప్రభుత్వ అధికులు నిర్వహించిన సామరస్య సమావేశం మంచి ఫలితాలను ఇస్తోందని చెప్పవచ్చు. పాత నగరంలో మసీదు కమిటీలు మండపాల వద్ద ప్రత్యేకంగా నిఘా పెడుతున్నారు. శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా ఆయా ప్రాంత నాయకులు అహర్నిశలు రక్షణ కల్పిస్తున్నారు.
కాగా అనుకూలతను బట్టి, పోలీసు మరియు పురలక శాఖ అధికారుల ఆదేశానుసారం 3, 5, 11 రోజుల తర్వాత గణేశులను నిమజ్జనం చేయనున్నారు. ఆంధ్రపరేశ్ లో ప్రధాన పట్టణాలు, నగరాలతో పాటు గ్రామాలతోనూ వినయక మండపాలు వెలిశాయి. ప్రతి వీధిలో ఓ విగ్రహాన్ని సమిష్టిగా ప్రతిష్ఠించారు.
